..

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అధికార పార్టీ నేతలు

అభివృద్ధి చేసే అధికార పార్టీకే పట్టం అంటున్న ప్రజలు

చెరువు గ్రామంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజుకి ఘన స్వాగతం..

పూల వర్షంతో పసుపుమయమైన రహదారులు

బాపట్ల (రాధే సింధూరం )స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు బాపట్ల మండలం చెరువు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.ఈ సందర్భంగా చెరువు గ్రామ ప్రజలు, కార్యకర్తలు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు కి అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలోని రోడ్లన్నీ పసుపుమయంగా మారిపోయి, పండుగ వాతావరణాన్ని తలపించాయి. ప్రజల నుంచి వస్తున్న ఈ అఖండ స్పందన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకలా మారుతుందని స్పష్టం చేస్తోంది.
గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న తమ నాయకుడిని చూసేందుకు, ఆయనతో మమేకం అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు.