రేపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏం జరుగుతుంది
నిఘా నిద్రపోతుంటే దగా దండుకుంటుంది..?
డబ్బులు ఇవ్వనిదే ముందుకు సాగని పనులు
ఎల్‌ఆర్‌ఎస్‌ను అడ్డం పెట్టుకొని భారీ బాదుడు, ఇతర నియోజకవర్గాల నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్లకు వస్తున్న విధానంలో ఏ స్థాయిలో అవినీతి అర్థం అవ్వచ్చు...?
అసైన్డ్ రిజిస్ట్రేషన్లు, ప్రతి రిజిస్ట్రేషన్ కి సంబంధిత అధికారులకు ముడుపులు,మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికెట్ల జారీకి అడ్డగోలు వసూళ్లు
పేదవాడు అయితేరోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్న సిబ్బంది, డబ్బున్న వాడికి ఒక విధానం
రేపల్లె, (రాధే సింధూరం ) సబ్ రిజిస్ట్రార్ కార్యా లయంలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతీ పనికి డబ్బులు గుంజడం సిబ్బందికి అలవాటైపోయింది. పైసలియ్యకపోతే గంటలో కావాల్సిన పనికి రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని రూపుమాపేందుకు ముఖ్యంగా భూముల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. రెవెన్యూ శాఖలో అవినీతి హెచ్చుమీరిందని భావించిన కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా వీఆర్వో వ్యవస్థనే రద్దుచేశారు. తహసీల్దార్లకు ఉన్న సర్వాధికారాల్లో కొన్నింటికి కత్తెర వేస్తూ ఆర్డీఓలకు అప్పగించింది. అలాగే సబ్ రిజిస్ట్రార్‌ల అధికా రాల్లో కొన్ని తహసీల్దార్‌లకు తర్జుమా చేసింది. అయినా కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి అంతం కాకపోగా, లంచాల కోసం ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. పేరుకు మాత్రం సిటిజన్ చార్ట్స్, ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేస్తూ కింది సాయి సిబ్బందితో వసూలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై సంబంధిత ఏసీబీ అధికారులు దాడి చేస్తే పెద్ద మొత్తంలో తిమింగరాలు బయటపడే అవకాశం కలదు. సంబంధిత అవినీతి అధికారులపై వారు చేస్తున్న దందాలపై మరొక ప్రత్యేక కథనం..