వినుకొండ పట్టణ చుట్టుపక్కల గ్రామాలలో జోరుగా అక్రమ రేషన్ బియ్యం దందా...
అంజన్న ఆధ్వర్యంలో సిండికేట్ లక్షల్లో ముడుపులు ఎవరికి ఇస్తున్నారు..?
అక్రమ రేషన్, మైనింగ్ వ్యవహారాలలో నెలవారి ముడుపులు అందుకుంటున్న ముఖ్య నేత ఎవరు..?
అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపణలు…?
కూటమి ప్రభుత్వానికి మచ్చ తెస్తున్న వినకొండ సిండికేట్ కేటుగాలపై చర్యలు ఎప్పుడు..?
వినుకొండ(రాధే సింధూరం )పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ చుట్టుపక్కల గ్రామాల మిల్లల్లో నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నదనేది బహిరంగ రహస్యంగా మారింది. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయు. వినుకొండ నియోజకవర్గం లో పలు గ్రామాల్లో బియ్యం నిల్వ కేంద్రాలను పెట్టుకొని ఆటోలు, మినీ వ్యాన్‌లు, బొలేరో వాహనాల్లో నింపి, ఇతర ప్రాంతాలకు తరలిస్తూ తరలిస్తూ అక్రమార్జన చేస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ దందాపై పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరా అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డులు జారీ చేసి వారికి ఆసరాగా ఉండేందుకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది. పేదల ఆకలి తీర్చాలనే ఆశయంతో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా స్థానిక ఒక నేతకు నెలవారీ ముడుపులు అందిస్తూ అంజన్న వారి సిండికేట్ ఆధ్వర్యంలో అక్రమ రేషన్ బియ్యం 100 చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా, ముఖ్యమంత్రి ఆదేశాల సైతం ధిక్కరిస్తూ లంచాలు తీసుకుంటున్న ఆ నేతపై నిఘా నేత్రాలు ద్వారా సమాచార సేకరణ జరుగుతుందా..?సివిల్ సైప్లె శాఖలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నదని పలువురు భావిస్తున్నారు. స్థానిక నేతల ఒత్తిళ్లు, ముడుపుల ప్రభావం పనిచేస్తున్నది బహిరంగ రహస్యం.రేషన్ దందాను అరికట్టడానికి రేషన్ దుకాణాల్లో ఈ పాస్, బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చినా ఫలితం లేకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ దందాను అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మొక్కుబడి దాడులు చేస్తున్నారే తప్ప నిర్థిష్టమైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినుకొండలో రేషన్ బియ్యం అంజన్న ఆధ్వర్యంలో సిండికేట్ చేతుల్లో రేషన్ బియ్యం దందా రెక్కలు విప్పుతుందనేది బహిరంగ రహస్యమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రేషన్ బియ్యం అక్రమ దందాను ఆ నియోజకవర్గంలో లో సంబంధిత అధికారులు కట్టడి చేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణల్లో నిజం లేకపోలేదు. అధికారులకు ప్రత్యేక దృష్టి సారించి రేషన్ బియ్యం దందాను వినుకొండ నియోజకవర్గం లో కింగ్ లా రాజ్యమేలుతున్న తతంగం పట్ల ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు